: విశాఖ భూ వివాదాలపై చంద్రబాబు సీరియస్!


విశాఖపట్నంలో పెరిగిపోతున్న భూ వివాదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ వివాదాలు విపక్షానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు విశాఖ భూ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. సాక్షాత్తు ఏపీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సైతం ఈ భూ వివాదాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ భూ వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో ఆయన మాట్లాడారు. భూ వివాదాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి... వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News