: ఇక్కడే నన్ను పట్టుకున్నారు... ఎంత మంది అత్యాచారాలు చేశారో చెప్పలేను!: కన్నీటి పర్యంతమైన యాజాదీ మహిళ మురాద్


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల విశృంఖల లైంగిక జీవన విధానం...మహిళలకు నరకం చూపించిన విధానాన్ని బాహ్య ప్రపంచానికి చాటిన ఇరాక్ కు చెందిన యాజాదీ మహిళ నదియా మురాద్ గుర్తుండి కదా! తాను బందీగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పట్టుబడిన ప్రాంతానికి తాజాగా వెళ్లిన ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే లాయర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న నదియా మురాద్, ఇరాక్ లోని యాజాది గ్రామాన్ని సందర్శించారు. ఎంతో ఆనందంగా ఉండే తమ జీవితాల్లో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న దురాగతాన్ని అంతర్జాతీయ మీడియాకు వివరించారు.

'2014 వేసవిలో మా గ్రామం యాజిదిని ఒక్కసారిగా ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. కొన్ని నిమిషాల్లోనే మగవారు.. ఆడవారు అంటూ వేరు చేశారు. పురుషులందర్నీ మా కళ్లముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. దీంతో మమ్మల్ని కూడా చంపేస్తారని భావించాం. కానీ అలా చేయలేదు. మాలోని యువతులందర్నీ ఇరాక్ లోని మొసూల్ తీసుకెళ్లి వేలం వేశారు. అప్పటికే వారి చేతుల్లో నలిగిపోయిన మేము ఆ తరువాత సిరియన్లు, ఇరాకీయులు, ట్యూనిషియన్లు, యూరోపియన్ల కామదాహానికి బలయ్యాము. చీకటి గదుల్లో ఒకరి తరువాత ఒకరుగా మాపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లు. నరకం చూపించే వాళ్లు. ఇలా 3 వేలకు ముందికి పైగా యాజాదీ మహిళలను వారు సెక్స్ బానిసలుగా మార్చేశారు. అదృష్టవశాత్తూ నేను అదే ఏడాది నవంబర్ లో ఎలాగోలా తప్పించుకోగలిగాను' అంటూ గతాన్ని గుర్తు చేసుకుని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News