: ఐర్లాండ్ లో చరిత్ర నెలకొల్పిన మహారాష్ట్రియన్!


ఐర్లాండ్ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వరద్కార్ (38) ఎన్నికై చరిత్ర నెలకొల్పారు. ఐర్లాండ్ కు అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ఎన్నికయ్యారు. అవినీతి, కుంభకోణాల కారణంగా ప్రస్తుత ప్రధాని ఎండా కెన్నీ (66)ని పైన గేల్ పార్టీ తొలగించింది. ఈ నేపథ్యంలో సైమన్ కొవెనేతో పోటీ పడి లియో వరద్కార్ విజయం సాధించారు. అలాగే ఐర్లాండ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి గే (స్వలింగ సంపర్కుడు) కూడా ఆయనే కావడం విశేషం.

లియోవరద్కార్ ముంబైలోని స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన సోదరి, ఒడిస్సీ డ్యాన్సర్ కూడా అయిన సుబదా వరద్కార్. వీరి పూర్వీకుల గ్రామం వరద్... లియో తండ్రి అశోక్‌ వైద్యుడు. 1970ల్లో వైద్యవిద్యను అభ్యసించేందుకు భారత్ నుంచి ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ ఆయనకు ఐరిష్‌ నర్స్‌ మిరియంతో పరిచయం ఏర్పడింది. లియో ఇంగ్లండ్‌ లోనే పుట్టారు. తదనంతర కాలంలో ఐర్లండ్‌ లో స్థిరపడ్డారు. కాగా, 2015లో పాప్యులర్ ఓట్‌ ద్వారా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఐర్లండ్‌. కాగా, ఇప్పుడు ఆ దేశానికి ఒక గే ప్రధాని కాబోతున్నాడు.

  • Loading...

More Telugu News