: 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నవనిర్మాణ దీక్షను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఈ దీక్షలో పాల్గొనని తమ పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని తన నివాసంలో తమ పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. ఈ రోజు జరిగిన దీక్షపై వివరాలు సేకరించారు. ఈ రోజు దీక్షలో 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు పాల్గొనలేదని తెలుసుకుని, వారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యపు ధోరణిలో ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకైనా పాల్గొనాలని సూచించారు.