: ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్ ఆలౌట్.. ఆరు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్
ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లు తలపడుతున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా ఈ మ్యాచును 46 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెరుగైన స్కోరు నమోదు చేశారు. గుప్తిల్ 26, రాంచి 65, కానే 100, టైలర్ 46, బ్రూమ్ 14, నీషామ్ 6, అండెర్సన్ 8, సాంటర్ 8, మిల్నీ 11, సౌతీ (0) నాటౌట్, బౌల్ట్ 0 పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో న్యూజిలాండ్‌కి 7 పరుగులు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ 291 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ ఆరు వికెట్లు తీశాడు. హెస్టింగ్స్ 2 వికెట్లు తీయగా కమ్మింగ్స్ కి ఒక్క వికెట్ దక్కింది.