: నలభై ఏళ్లుగా భారత్, చైనా మధ్య ఒక్క తూటా కూడా పేలలేదు: రష్యాలో ప్రధాని మోదీ


నాలుగు దేశాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ర‌ష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వ‌హించిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు-2017లో ప్ర‌సంగించారు. ఇరవై ఏళ్ల కింద ఉన్న ప్రపంచం వేరు.. ఇప్ప‌టి ప్ర‌పంచం వేర‌ని, ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయ‌ని తెలిపారు. దేశాల మధ్య సంబంధాలు కూడా పెరిగాయని చెప్పారు. ప్ర‌స్తుతం చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగయ్యాయని చెప్పారు.

 40 ఏళ్ల కిందటితో పోల్చుకుంటే ప్ర‌స్తుతం చైనా, భార‌త్ మ‌ధ్య‌ ఎంతో మార్పు వచ్చిందని, ఈ న‌ల‌భై ఏళ్ల‌లో ఇరు దేశాల సరిహద్దుల్లో ఒక్క తూటా కూడా పేల‌లేద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ప్రపంచం ఆసియా దేశాలపై దృష్టి సారిస్తోందని చెప్పిన మోదీ.. ముఖ్యంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న‌ భారత్‌పై ఇతర దేశాల నమ్మకం పెరిగింద‌ని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమితాస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయ‌ని పేర్కొన్నారు. భార‌త్‌ డిజిటల్ ఇండియా దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని చెప్పారు.                 

  • Loading...

More Telugu News