: మియాపూర్ భూ కుంభకోణంలో కేటీఆర్, కవిత, ఆమె భర్త: మధు యాష్కీ ఆరోపణలు
కేసీఆర్ మూడేళ్ల పాలన ఓ దరిద్రపు పాలన అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ మండిపడ్డారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన వ్యక్తి... ఇప్పుడు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణంలో కేటీఆర్, కవిత, కవిత భర్త కన్నారావుల పాత్ర ఏ మేరకు ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. మంత్రులంతా సీమ పందులుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ హబ్ పేరు చెబుతూ గబ్బు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించకుండా... వాళ్ల బాత్రూంలను మాత్రం బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారని విమర్శించారు. తెలంగాణ అమరవీరులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల శాపం కేసీఆర్ కు తగులుతుందని శపించారు. సర్వేలతోనే టీఆర్ఎస్ నాశనమవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబ దోపిడీపై రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.