: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి నిరాశ
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి తీవ్ర నిరాశ ఎదురైంది. విదేశాల్లో ఉంటూనే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్ సీఏ) లో చక్రం తిప్పాలనుకున్న ఆయనకు చుక్కెదురైంది. ఆర్ సీఏ అధ్యక్షుడిగా పోటీ చేసిన లలిత్ మోదీ కుమారుడు రుచిర్ మోదీ ఓటమిపాలయ్యారు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత సీపీ జోషీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఈ ఎన్నికల్లో రుచిర్ మోదీకి 14 ఓట్లు రాగా... మరోవైపు జోషీకి 19 ఓట్లు వచ్చాయి. అయితే మోదీ ప్యానల్ కు చెందిన వారికి కార్యదర్శి, కోశాధికారి పదవులు దక్కాయి. ఐపీఎల్ లో భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో, లలిత్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.