: స్వయం ప్రకాశం లేని నేత చంద్రబాబు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు


అధికారానికి దూరమయ్యామన్న విరహవేదనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తమకు వాళ్లు ఎన్నో సవాళ్లు విసిరారని... కానీ, బహిరంగంగా ఎదుర్కోవడానికి మాత్రం రారని విమర్శించారు. 40 పార్లమెంటు సీట్లు కూడా లేని కాంగ్రెస్ కూడా ఓ జాతీయ పార్టీయేనా? అని ఎద్దేవా చేశారు. దక్షిణాదిలో ఏమాత్రం బలం లేని బీజేపీ కూడా జాతీయ పార్టీయేనా? అని ప్రశ్నించారు. అవన్నీ పెద్దసైజు ప్రాంతీయ పార్టీలని, తమవి చిన్న సైజు ప్రాంతీయ పార్టీలని అన్నారు.

ఉస్మానియా యూనివర్శిటీ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదంటూ చాలా విమర్శలు చేశారని... అక్కడ మాట్లాడాల్సింది రాష్ట్రపతి అని, ఆయన మాట్లాడారు, వెళ్లిపోయారని... ఇందులో కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన విషయం ఏమీ లేదని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా చాలా సంతృప్తిగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడని... ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన గెలుస్తారే తప్ప, సొంతంగా గెలవలేరని ఎద్దేవా చేశారు. ఓ చానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


  • Loading...

More Telugu News