: అతనికి ఇకపై రెండు గుండెలు!
కేరళకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఇక మీదట రెండు హృదయాల స్పందనలతో జీవించనున్నాడు. సాధారణంగా గుండె వైఫల్యం పాలైన వారికి గుండె మార్పిడి చికిత్స చేయడం విన్నాం. కానీ, ఈ కేసులో మాత్రం విఫలమైన గుండెను వైద్యులు తొలగించలేదు. మరో దాత అందించిన గుండెను అదనంగా తీసుకెళ్లి అనుసంధానించారు. ఇదో అరుదైన చికిత్స. ఒకే గుండెపై పూర్తి భారం పడకుండా ఇలా చేశారు. ఈ వ్యక్తిలో స్వతహాగా ఉన్న గుండె పనితీరు తగ్గిపోయి... 10 శాతం మేరే పనిచేస్తోంది. దీంతో వైద్యులు సర్జరీలో భాగంగా ఛాతీ కుడి భాగంలో గుండెను అమర్చేందుకు కొంత ఖాళీని తీసుకొచ్చారు. ఓ మహిళా దాత నుంచి తీసుకొచ్చిన గుండెను అక్కడ ఉంచి సర్జరీ పూర్తి చేశారు.