: 'అంధగాడు' సినిమాపై రామ్ గోపాల్ వర్మ స్పందన
'అంధగాడు' సినిమాను తాను చూశానని... ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటన తనను చాలా ఆకట్టుకుందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు. సాధారణంగా కామెడీ టచ్ తో ఉండే క్యారెక్టర్లను చేసే రాజ్ తరుణ్... ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించాడని కితాబిచ్చాడు. సినిమా మొత్తం రకరకాల మలుపులు తిరుగుతూ, ఆసక్తికరంగా కొనసాగుతుందని తెలిపాడు. సినిమా చాలా బాగుందని... చిత్రానికి సంబంధించిన టీమ్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పాడు.