: తెలంగాణ అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నా.. ఏపీ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: మోదీ


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. హైదరాబాదుతో పాటు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
ఏపీ ప్రజలకు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సాహవంతులైన ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే దేశ అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని ఏపీ కొనసాగించాలని కోరారు.

  • Loading...

More Telugu News