: ఐర్లాండ్ లో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న మహారాష్ట్రియన్?
ఐర్లాండ్ దేశ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఈ పోటీలో ప్రధాన అభ్యర్థుల్లో భారత సంతతికి చెందిన లియోవరద్కార్ కూడా ఉన్నారు. ఫలితాల్లో వరద్కార్ ఎన్నిక ఖాయం అయితే చరిత్ర సృష్టించినట్టే. అంతేకాదు 38 ఏళ్లకే ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించిన అతి కొద్ది మందిలో ఒకరిగానూ ఆయన పేరు రికార్డుల్లోకి చేరుతుంది. లియోవరద్కార్ ముంబైలోని స్వాంతంత్ర సమరయోధుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన సోదరి, ఒడిస్సీ డ్యాన్సర్ కూడా అయిన సుబదా వరద్కార్ ఈ విషయమై స్పందిస్తూ... తమ పూర్వీకుల గ్రామం వరద్ గా పేర్కొన్నారు. లియోవరద్కార్ డాక్టరేనని, గతంలో పుణెలోని కేఈఎం ఆస్పత్రిలో ఇంటర్న్ షిప్ కూడా చేసినట్టు ఆమె తెలిపారు. రాజకీయాలంటే వరద్కార్ కు ఆసక్తి అని, తను క్రీడా మంత్రిగా ఉన్న సమయంలో ఐరిష్ జట్టును ముంబైకి తీసుకొచ్చినట్టు చెప్పారు.