: 400 కేజీల బంగారం, వజ్రాల గురించి టెన్షన్ పడుతున్న చెన్నై సిల్క్స్ యాజమాన్యం!
చెన్నైలోని టీనగర్ లో ఉన్న చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగి మాల్ మొత్తం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో షాపులోని ఐదు ఫ్లోర్లలోని బట్టలు మొత్తం తగలబడిపోయాయి. దాదాపు రూ. 80 కోట్ల విలువైన దుస్తులు కాలిపోయాయి. అయితే షాప్ యాజమాన్యానికి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. షాప్ లోని సేఫ్టీ లాకర్లలో 400 కేజీల బంగారం, రూ. 20 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని బయటకు తెచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో లాకర్లలో ఉన్న బంగారం, వజ్రాల పరిస్థితి ఎలా ఉందోనని టెన్షన్ పడుతోంది. అయితే, భారీ అగ్ని ప్రమాదాలు సంభవించినా సేఫ్టీ లాకర్స్ కు ఏమీ కాదని కొంతమంది చెబుతున్నారు. మరోవైపు బిల్డింగ్ కు, మెటీరియల్ కు షాపు యాజమాన్యం ఇన్స్యూరెన్స్ చేయించి ఉండటంతో నష్ట పోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది.