: రాజ్ తరుణ్ తో ఏమీ లేదు...మేం మంచి స్నేహితులం మాత్రమే!: హెబ్బా పటేల్
రాజ్ తరుణ్, తాను మంచి స్నేహితులమని యువనటి హెబ్బా పటేల్ తెలిపింది. 'అంథగాడు' సినిమా ప్రమోషన్ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ, తమ స్నేహం గురించి మీడియాలో వచ్చే వార్తలు చూసి నవ్వుకుంటామని చెప్పింది. తమ ఇద్దరిదీ మంచి కాంబినేషన్ అని చెప్పింది. తాము కలిసి నటించిన సినిమాలు అభిమానులను అలరించడంతో ఏవేవో పుకార్లు పుట్టించారని చెప్పింది.
తమ ఇద్దరిది మంచి కాంబినేషన్ కనుకే హిట్స్ వచ్చాయని చెప్పిన హెబ్బా, తమ రిలేషన్ షూటింగ్ వరకేనని తెలిపింది. సహనటులు ఎవరైనా సరే పాత్ర పోషణ కోసం వారితో సౌకర్యంగా ఉంటామని చెప్పింది. అంత మాత్రానికే లేనిపోని పుకార్లు పుట్టిస్తారని హెబ్బా పటేల్ వాపోయింది. కాగా, రాజ్ తరుణ్ తో హెబ్బా నటించిన 'అంథగాడు' సినిమా నేడు విడుదలైంది.