: తెలంగాణ ముందుంది నిజమే... మనకు సత్తా లేదా?: చంద్రబాబు


వ్యాపారానికి అత్యంత అనుకూలవంతమైన రాష్ట్రాల్లో ఏపీ కన్నా తెలంగాణ రాష్ట్రం ముందుందని గుర్తు చేసిన చంద్రబాబు, భవిష్యత్తులో నవ్యాంధ్ర దాన్ని అధిగమిస్తుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అవిభాజ్య ఏపీని తొలి స్థానంలో నిలిపేందుకు తానెంతో కృషి చేశానని, ఆ ఫలితాలను ఇప్పుడు తెలంగాణ వాసులు అనుభవిస్తుండటం, తనకు ఆనందాన్ని కలిగిస్తున్నా, నవ్యాంధ్రను ప్రస్తుతమున్న ఐదో ర్యాంకు నుంచి ఫస్ట్ ర్యాంకుకు తేవడమే తన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ సత్తా మనకు లేదా? అని నవనిర్మాణ దీక్ష అనంతరం ప్రసంగిస్తూ, సభికులను చంద్రబాబు అడిగారు. రాష్ట్రాన్ని విభజించిన వేళ, చట్టంలో చేర్చిన అంశాలను ఒక్కొక్కటిగా సాధిస్తున్నామని, ఇంకా సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఆర్థిక సంస్కరణల ద్వారా ఆదాయం పెరుగుతుందని, అవినీతి లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కృషి చేస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News