: తెలంగాణ వారు సంబరాలు చేసుకోవడం సబబు... మీకెందుకు సంబరాలు?: చంద్రబాబుపై రోజా ఫైర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆయన ప్రారంభించింది నవ నిర్మాణ దీక్ష కాదని... నారావారి నయవంచన దీక్ష అని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే... చంద్రబాబు మాత్రం నవ నిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అని ఎద్దేవా చేశారు.

ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ చంద్రబాబుకు ఆమె సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవడంలో ఒక అర్థం ఉందని... అడ్డగోలుగా ఏపీని విభజించిన తర్వాత ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే, నవ నిర్మాణ దీక్షతో వారం పాటు మీ సంబరాలు ఏంటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News