: నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞ ఇదే!


విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు అందరి చేత చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఈ దీక్షలు నేటి నుంచి ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞ ఇదే...

అవినీతి, కుట్ర రాజకీయాల పట్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించటానికి సంసిద్ధంగా ఉన్నాము.
స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో అలుపెరుగని శ్రమజీవులం మనము.
ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకుందాము.
 
దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో, మన రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పని చేద్దాం.
2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో... మూడు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా,
2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా,
2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా
తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
 
అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే
ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం.
ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం.
ఆంధ్రప్రదేశ్‌ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం.

జై ఆంధ్రప్రదేశ్... జై జై ఆంధ్రప్రదేశ్
జై జన్మభూమి... జై జై జన్మభూమి
జై హింద్‌.

  • Loading...

More Telugu News