: ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగిస్తూ కూలబడ్డ కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో స్వల్ప అపశ్రుతి దొర్లింది. వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తన ప్రసంగం మధ్యలో అస్వస్థతకు గురై కూలబడిపోయారు. ఎండ అధికంగా ఉండటంతోనే ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన అధికారులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు. ఎండ అధికంగా ఉండటంతోనే ఆయనకు కళ్లు తిరిగాయని సమాచారం. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.