: పాక్ జైళ్లలో ఇంకా 254 మంది భారతీయులు
పాకిస్థాన్ జైలులో భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ పై జరిగిన హత్యాయత్నంతో అసలు ఎంత మంది ఖైదీలు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు? అనే ప్రశ్న చాలా మందిలో ఉదయించే ఉంటుంది. పాక్ జైళ్లలో ఇంకా 254 మంది బందీలుగా ఉన్నారు. ఎక్కువగా భారతీయులు గల్ఫ్ దేశాలలో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. సౌదీ అరేబియాలో 1691 మంది, కువైట్ లో 1161, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 1012 మంది ఉన్నారు.
తిరువనంతపురానికి చెందిన లాయర్ బిను సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ప్రభుత్వం నుంచి సేకరించి వెల్లడించారు. ఇటలీలో 121 మంది, బ్రిటన్ లో 426, అమెరికాలో 155, చైనాలో 157, బంగ్లాదేశ్ లో 62, అఫ్ఘానిస్తాన్ లో 28 మంది, నేపాల్ లోని జైళ్లలో 377 మంది భారతీయులు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు.