: దత్తత గ్రామస్తులకు సినిమా చూపించిన సచిన్ టెండూల్కర్!
తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగ ప్రజల కోసం సచిన్ టెండూల్కర్, తన బయోపిక్ 'సచిన్ - ఏ బిలియన్ డ్రీమ్స్' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. నెల్లూరు లోని ఎస్-2 సినిమాస్ లో గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులతో కలసి వచ్చి చిత్రం చూశారు. ఈ సందర్భంగా వారిని కలిసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, గ్రామంపై సచిన్ ప్రత్యేక దృష్టిని సారించారని, ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం రూ. 9 కోట్లను ఖర్చు చేశారని గుర్తు చేశారు. సచిన్ జీవితం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని చిన్నారులకు, యువతకు పిలుపునిచ్చారు.