: స్పైడరా? మజాకా?... 24 గంటలు కాకుండానే 40 లక్షలు దాటిన వ్యూస్


భారీ అంచనాలతో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపుదిద్దుకుంటున్న మహేష్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' టీజర్ నెట్టింట శరవేగంగా దూసుకెళుతోంది. నిన్న ఉదయం ఈ టీజర్ విడుదల కాగా, 24 గంటలు గడవకముందే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. నిన్న 11 గంటల సమయంలో ఇది విడుదల కాగా, నేటి ఉదయం 9 గంటల సమయానికి 41.83 లక్షల వ్యూస్ ను దాటేసింది. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తయారవుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైన ఐదు గంటల్లోపే మిలియన్ వ్యూస్ దాటేయగా, ఇప్పటివరకూ 2 లక్షల లైక్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ ను చూసిన పలువురు చిత్ర ప్రముఖులు ఇది అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రం కోసం దసరా వరకూ ఆగలేమంటున్నారు. కాగా, ఈ టీజర్ బుధవారం నాడే విడుదల కావాల్సి వుండగా, దర్శకరత్న దాసరి మరణంతో ఒక రోజు ఆలస్యంగా గురువారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News