: యూపీలో దారుణం... భర్తను చికిత్సకు తీసుకువెళ్తే... భార్యను గ్యాంగ్ రేప్ చేసిన ఆసుపత్రి సిబ్బంది!


గ్యాంగ్ రేప్ ల సంఘటనల వార్తలతో యూపీ పేరు మార్మోగిపోతోంది. యూపీ రాజధాని లక్నోలో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని హర్దోయ్‌ కు చెందిన మహిళ (42) భర్త అనారోగ్యానికి గురికావడంతో అతనిని తీసుకుని లక్నోలోని కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స ప్రారంభం కావడంతో ఆసుపత్రిలో ఉన్న భర్తకు ఆహారం తీసుకొచ్చేందుకు ఆమె బయటకు వెళ్తున్న సమయంలో.. అక్కడి లిఫ్ట్‌ బాయ్‌, సెక్యూరిటీ గార్డు, మరో వ్యక్తి కలసి ఆసుపత్రి ప్రాంగణంలోని ఒక గదిలోకి ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సెక్యూరిటీ గార్డు శివకుమార్‌, మరో వ్యక్తి సంతోష్‌ ను అదుపులోకి తీసుకోగా, లిఫ్ట్‌ బాయ్‌ వినయ్‌ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News