: మూడెకరాల్లో కేసీఆర్ ముఖచిత్రం... టీఆర్ఎస్ యువనేత ల్యాండ్ మ్యూరల్!
టీఆర్ఎస్ యువనేత తమపార్టీ అధినేతపై వినూత్నంగా అభిమానం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు పాటిమీద జగన్ మోహన్ రావు సంగారెడ్డి జిల్లా చింతల చెరువు గ్రామపరిధిలోని తన వ్యవసాయక్షేత్రంలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి ముఖచిత్రాన్ని (ల్యాండ్ మ్యూరల్) గీశారు.
ఇందు కోసం ఇటలీకి చెందిన ప్రముఖ చిత్రకారుడిని సంప్రదించి మెలకువలు నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు. తన వ్యవసాయక్షేత్రంలో 3 ఎకరాల నేలను చదును చేసి, కేసీఆర్ ముఖచిత్రం తీర్చిదిద్దేందుకు 4 రోజులపాటు 30 మంది యువకులు శ్రమించారని అన్నారు. ఈ సందర్భంగా ఈ ల్యాండ్ మ్యూరల్ కు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. మీరు కూడా దానిని చూడండి.