: సీన్ రివర్స్... పామును మింగేసిన కప్ప!
కప్పలను పాములు మింగడం సహజం. అయితే కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఓ కప్పను పాము మింగేసింది. దీనిని గ్రామస్థులు ఆసక్తిగా చూశారు. పంటకాల్వలో తనను మింగేయడానికి ప్రయత్నించిన బురద పామును పెద్ద కప్ప ఒకటి గట్టిగా ఒడిసిపట్టేసింది. దాని బారి నుంచి తప్పించుకుని దానిని మింగేందుకు పాము తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కప్ప పట్టును మాత్రం వదల్లేదు. దీంతో లుంగలు చుట్టుకున్న పామును కప్ప ఒడుపుగా మింగేసింది. దీంతో గ్రామస్థులంతా 'ఇదేమి చోద్యం!' అంటూ ముక్కున వేలేసుకున్నారు.