: బాహుబలి 2 ఖాతాలో చేరిన కొత్త రికార్డు!


‘బాహుబలి 2:ద కన్ క్లూజన్’ సినిమా రికార్డుల పరంపర ఇంకా ఆగలేదు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు సమాధానంగా విడుదలైన ఈ సినిమా అనితర సాధ్యమైన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లతో తిరుగులేని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటికే నిలిచిన ఈ సినిమా తన వసూళ్ల ఖాతాలో కొత్త రికార్డు సొంతం చేసుకుంది.

అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రంగా ‘బాహుబలి 2: ద కన్ క్లూజన్’ నిలిచిందని ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్స్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా కేవలం హిందీ భాషలోనే 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ఆయన తెలిపాడు. దీంతో హిందీలో 2014లో విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన ‘పీకే’ (300 కోట్ల రూపాయలు), దాని తరువాత 2009లో విడుదలైన ‘త్రీ ఈడియట్స్‌’ 200 కోట్ల రూపాయలతో, అనంతరం 2008లో విడుదలైన ‘గజిని’ (100 కోట్లు), నిలిచాయని తరణ్ ఆదర్శ్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News