: కరుణానిధికి సోనియా శుభాకాంక్షలు.. ప్రపంచంలోనే అరుదైన రికార్డన్న కాంగ్రెస్ చీఫ్!


డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి 94వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్  చీఫ్ సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఆయనే అతిపెద్ద నేత అని అభివర్ణించారు. 1969 తర్వాత తమిళనాడు రెండు మూలస్తంభాల్లో కరుణ ఒకరుగా నిలిచారని కొనియాడారు. కరుణానిధి మచ్చలేని నాయకుడని, 48 ఏళ్లపాటు ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేదని, ఇది అరుదైన ఘటన అని సోనియా పేర్కొన్నారు. జర్నలిస్టుగా, నవలా రచయితగా, కవిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఆయన సేవలు అసామాన్యం అని సోనియా కొనియాడారు.

  • Loading...

More Telugu News