: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. వాడవాడలా సంబురాలు!


నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గన్ పార్క్ కు వెళ్లి అమర వీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం నేరుగా సికింద్రాబాదు పరేడ్‌ మైదానానికి చేరుకుని ఉదయం 10.30 గంటలకు జాతీయపతాకాన్ని ఎగురవేసి రాష్ట్రావతరణ వేడుకలను ప్రారంభిస్తారు.

అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇందుకు అవసరమైన 15 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్‌, ఇతర భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

  • Loading...

More Telugu News