: తొలి విజయం ఆతిథ్య దేశానిదే... విజయానికి రూట్ వేసిన జోరూట్!
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇంగ్లండ్ బోణీ కొట్టింది. ఓవల్ లో జరిగిన తొలి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కు తమీమ్ ఇక్బాల్ (128) సెంచరీతో శుభారంభం ఇచ్చాడు. అనంతరం ముష్పికర్ రహీమర్ (79) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్లకెట్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఆదిలోనే జాసన్ రాయ్ (1) వికెట్ ను మొర్తజా తీయగా, హేల్స్ (95) ధాటిగా ఆడి సెంచరీ మిస్సయ్యాడు. అనంతరం జో రూట్ (133), ఇయాన్ మోర్గాన్ (75) అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కేవలం రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 308 పరుగులు చేసి, ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో తొలి మ్యాచ్ లో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ నిలవగా తొలి సెంచరీ చేసిన వ్యక్తిగా తమీమ్ ఇక్బాల్ నిలిచాడు.