: మ‌హిళ‌ల‌తో చిత‌క్కొట్టించుకున్న కానిస్టేబుల్!


ఓ పోలీస్ కానిస్టేబుల్ మ‌హిళ‌ల‌తో త‌న్నులు తిన్న ఘ‌ట‌న తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నై ప‌రిధిలోని సాయుధ దళంలో పోలీసు కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న‌ మహేంద్రన్ భార్య శారద వారం రోజుల క్రితం పండంటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆయ‌న సెల‌వులు పెట్టి త‌న సొంత గ్రామ‌మైన‌ సేలం జిల్లా ఓమలూరులోని అమరకుందికి వెళ్లాడు. బిడ్డ‌పుట్టిన ఆనందంలో మహేంద్రన్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో, స్నేహితులంతా క‌లిసి మ‌ద్యం తాగుతూ.. పెద్దగా అరుస్తూ.. తందనాలాడారు. దీంతో స్థానిక మ‌హిళ‌లు అక్క‌డ‌ మద్యం తాగ‌కూడ‌ద‌ని చెప్పారు. దీంతో మ‌హేంద్ర‌న్ తాను పోలీసునని, ఎక్కువ మాట్లాడితే ఎవ్వ‌రూ మిగ‌ల‌బోరంటూ అస‌భ్య‌ప‌ద‌జాలంతో తిట్టాడు. దీంతో త‌మ గ్రామ‌స్తులకు విష‌యం తెలిపిన ఆ మ‌హిళ‌లు వారిని వెంట‌పెట్టుకొని వ‌చ్చి  ఆ కానిస్టేబుల్‌ను చిత‌క్కొట్టారు. మహేంద్ర‌న్ తిర‌గ‌బ‌డ‌డంతో ఆయ‌నను విద్యుత్‌ స్తంభానికి కట్టేశారు. అనంత‌రం పోలీసులకు ప‌ట్టించారు.          

  • Loading...

More Telugu News