: అక్కడ మోదీ.. ఇక్క‌డ కేసీఆర్ అవే మాట‌లు చెప్పారు.. మోసం చేశారు: రాహుల్ గాంధీ


అక్క‌డ న‌రేంద్ర మోదీ, ఇక్క‌డ కేసీఆర్ ఎన్నిక‌ల ముందు ఒకే మాట చెప్పార‌ని, ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వ‌స్తే దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని మోదీ చెబితే, ల‌క్ష ఉద్యోగాలు ఇస్తామ‌ని ఇక్క‌డ కేసీఆర్ అన్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు సంగారెడ్డిలో నిర్వహిస్తున్న ప్రజాగర్జనలో ఆయన మాట్లాడుతూ... మేకిన్ ఇండియా అంటూ, పారిశ్రామిక విప్ల‌వం తెస్తానంటూ మోదీ ఎన్నో మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చార‌ని, మూడేళ్లు అవుతున్నా ఏమీ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు.

గుజ‌రాత్‌లో రైతుల భూములు అధికంగా లాక్కున్నార‌ని, ఆ త‌రువాత తెలంగాణ‌లో అధికంగా భూములు లాక్కుంటున్నార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంటు ప‌థ‌కాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం తుంగ‌లో తొక్కింద‌ని అన్నారు. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును కేవ‌లం కేసీఆర్ కుటుంబంలోని న‌లుగురి చేతుల్లోనే ఉంచుదామా? అని ప్ర‌శ్నించారు. అతి పెద్ద నిరుద్యోగ స‌మ‌స్య మోదీ హ‌యాంలో చూస్తున్నామ‌ని రాహుల్ మండిప‌డ్డారు.       

  • Loading...

More Telugu News