: ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్ లక్ష్యం 306 పరుగులు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో భాగంగా ఈ రోజు లండన్లోని ఓవల్ లో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసుకుంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 128 పరుగులు, ముష్ఫికర్ రహీమ్ 79 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకి 6 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఇంకా సౌమ్య 29, ఇమ్రుల్ 19, షాకిబ్ 10, షబ్బిర్ 24, రియాద్ 6, మోసద్దెక్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్ 59 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక జేక్ బాల్ 82 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయగా, మరో బౌలర్ స్టోక్స్ 42 పరుగులు ఇచ్చుకుని ఒక వికెట్ తీశాడు.