: ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్ పై అద్భుతంగా రాణిస్తున్న బంగ్లాదేశ్... తమీమ్ శతకం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017 తొలి మ్యాచ్‌లో ఈ రోజు ఇంగ్లండ్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు దిగి రాణిస్తోంది. లండన్‌లోని కిన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసి, 128 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతనితో పాటు ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చిన సౌమ్య సర్కార్ 28 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కూడా 19 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ముష్ఫికర్ రహీమ్ అర్ధసెంచరీ సాధించి, 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో షాకిబ్ 10, సబ్బీర్ 1 పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ స్కోరు 272 (46 ఓవర్లకి)గా ఉంది.