: విమానాశ్రయం నుంచి రాహుల్ గాంధీ భారీ ర్యాలీ.. తండ్రి విగ్రహానికి నివాళి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంలో మునిగిపోయాయి. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా ఆయన సోమాజీగూడ చేరుకున్నారు. అక్కడ ఉన్న తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి, ఆయన నివాళి అర్పించారు. రాహుల్ ర్యాలీ సందర్భంగా సికింద్రాబాద్-పంజాగుట్ట మార్గం జనసంద్రంగా మారింది. రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అభిమానులు ఎగబడ్డారు. రాహుల్ కూడా ఉత్సాహంగా వారితో చేయి కలిపారు. కొందరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అనంతరం ఆయన సంగారెడ్డిలో జరిగే పోరు గర్జన సభకు బయలుదేరారు.