: భారత ఆర్మీ దాడిపై పాకిస్థాన్ ఆగ్రహం
భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద రెచ్చిపోతున్న పాక్ రేంజర్లకు ఈ రోజు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమ ఐదుగురు రేంజర్లు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత ఉప హైకమిషనర్ జేపీ సింగ్ ను పాకిస్థాన్ విదేశాంగ శాఖ పిలిపించుకుంది. ఈ ఘటనపై ఆయనను వివరణ కోరుతున్నట్లు తెలుస్తోంది. భారత్ అన్యాయంగా దాడి చేసిందని, దీనిని ఖండిస్తున్నామని పాకిస్థాన్ ప్రకటన చేసింది.