: దినకరన్ కు ఊరటను ఇచ్చిన ఢిల్లీ కోర్టు.. బెయిల్ మంజూరు
అన్నాడీఎంకే శశికళ వర్గం నేత దినకరన్ కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పార్టీకి చెందిన రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ కోర్టు దినకరన్ కు, ఆయన అనుచరుడు మల్లికార్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. రెండాకుల గుర్తు కోసం సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.