: జగన్, పవన్ ను కూడా ఆహ్వానించాం: రఘువీరా


ఈ నెల 4వ తేదీన గుంటూరులో 'ప్రత్యేక హోదా భరోసా సభ'ను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లు వస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను కూడా సభకు ఆహ్వానించామని చెప్పారు.

విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న నవ నిర్మాణ దీక్షకు అనుమతి ఇవ్వరాదంటూ పోలీసు అధికారులను రఘువీరా కోరారు. ఇక్కడ దీక్షకు అనుమతిస్తే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని చెప్పారు. నవ నిర్మాణ దీక్షకు పోలీసులు అనుమతిస్తే... రేపట్నుంచి తాము కూడా రోడ్డుపై దీక్షలు, ధర్నాలు చేస్తామని అన్నారు. 

  • Loading...

More Telugu News