: అమరావతికి ఇప్పుడే రండి... ఆలస్యం చేస్తే నష్టమే: ఔత్సాహిక వ్యాపారులకు చంద్రబాబు సూచన
దేశ విదేశాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నవ్యాంధ్రకు, అందునా అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించాలని భావిస్తే, వెంటనే రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పుడు రాలేకపోతే తరువాత రాలేరని హెచ్చరించారు. హెచ్ఓడీలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, అన్ని రంగాల్లో ఇన్వెస్ట్ మెంట్ కు అమరావతి అనుకూలంగా ఉందని చెబుతూ, ఇప్పుడు రాకుండా, భవిష్యత్తులో ఇక్కడికి వద్దామని చూస్తే, చాలా నష్టపోతారని తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాన్ని అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశామని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.