: ఈ శని, ఆది వారాలు పనిచేయండి: ఉద్యోగులకు చంద్రబాబు ఆదేశం


ఈ వారాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. శని, ఆదివారాల్లో నవనిర్మాణ దీక్షలు చేపట్టనున్న కారణంగా, ఈ రెండు రోజులూ పని చేసి, ఆ తరువాత ఆప్షనల్ హాలిడే తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సోషల్ మీడియాను వినియోగించుకుని ప్రజల్లోకి వెళ్లాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. కలెక్టర్ల నుంచి అధికారుల వరకూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఈ ఉదయం వివిధ శాఖల అధిపతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, ప్రజలకు దగ్గరగా ఉండి, సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News