: రోలాండ్ గారోస్ లో సందడి చేసిన సెరేనా విలియమ్స్
సెరెనా విలియమ్స్ రోలాండ్ గారోస్ లో సందడి చేసింది. మూడు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన సెరేనా విలియమ్స్ ఈసారి క్రీడాకారిణిగా కాకుండా వీక్షకురాలిగా రావడం విశేషం. ఆరు నెలల గర్భవతి అయిన సెరేనా విలియమ్స్ టెన్నిస్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంది. సోదరి వీనస్ విలియమ్స్ రెండో రౌండ్ లో పోటీ పడనుండడంతో సెరేనా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చింది. బాయ్ ఫ్రెండ్ అలెక్స్ తో కలిసి కురుమి నారా (జపాన్) తో జరిగిన మ్యాచ్ ను వీక్షించింది. కాగా, ఈ మ్యాచ్ లో వీనస్ విలియమ్స్ 6-3, 6-1 తేడాతో కురుమి నారాపై విజయం సాధించింది.