: ఏ క్షణమైనా కుప్పకూలేందుకు సిద్ధంగా చెన్నై సిల్క్స్ భవనం!
భారీ అగ్నిప్రమాదం కారణంగా నిన్నటి నుంచి మంటల్లో దగ్ధమవుతున్న చెన్నై టీనగర్ ఫ్లయ్ ఓవర్ సమీపంలోని చెన్నై సిల్క్స్ భవంతి ఏ క్షణంలోనైనా కుప్పకూలే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. దాదాపు 60 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సాగుతున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రాకపోగా, ఆరు, ఏడు అంతస్తుల్లోని కాంక్రీట్, దాని మధ్యనున్న ఉక్కు కరిగి ఆ రెండు అంతస్తులూ కూలాయి. మొత్తం 10కి పైగా అంతస్తులున్న భవంతి ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని, పైనున్న ఫ్లోర్ల పిల్లర్స్ కరుగుతూ ఉండటంతో, ఆ బరువు కింది ఫ్లోర్లపై పడుతూ కూలేందుకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. పక్కన ఉన్న భవనాలను ఖాళీ చేయించామని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని పేర్కొన్నారు.