: రజనీకాంత్ పై భారతీరాజా శ్రుతి మించిన విమర్శలు ... ఆశ్చర్యపోయిన సభికులు!


తలైవా రాజకీయ ప్రవేశంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రముఖ దర్శకుడు భారతీరాజా తాజాగా చేసిన విమర్శలు తమిళనాట పెను కలకలం రేపుతున్నాయి. చెన్నై ప్రెస్ క్లబ్ లో కోలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్లు కొందరు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రజనీ రాజకీయ ప్రవేశంపై వ్యతిరేకత వ్యక్తం చేయడమే లక్ష్యం. అయితే ప్రముఖ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ, మే 17న మెరీనా బీచ్‌ లో ఈలం వార్ బాధితులకు నివాళిగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభను భగ్నం చేసి, ఆ ఉద్యమానికి ఆద్యుడైన తిరుమురుగన్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. తమపై ఎవరెవరో పెత్తనం చలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రధానంగా తమిళులు కాని వారు (రజనీని ఉద్దేశించి) తమపై పెత్తనం చలాయించాలని చూస్తున్నారని అన్నారు.

తమిళులకు మంచి నేతలు లేరని వారంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారొచ్చి తమని ఏలాలని చూస్తున్నారని మండిపడ్డారు. 'సరే వారన్నట్టే తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. అలాంటప్పుడు వీరొచ్చి మాత్రం ఏం చేస్తారు?' అని ప్రశ్నించారు. అంతే కాకుండా... వారు అలా అనడం ఎలా ఉందంటే... భార్య గర్భవతి కాలేదని బాధపడుతున్న వాడితో నీ బిడ్డకు తండ్రిగా ఉంటానని అడుగుతున్నట్టు ఉందని' ఆయన మండిపడ్డారు. దానికి కొనసాగింపుగా, ఏ విషయంలో అయినా భాగం అడగొచ్చు, కానీ పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తామంటూ ఆయన శ్రుతి మించి విమర్శించారు. భారతీరాజా అలా పచ్చిగా మాట్లాడేసరికి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు కానీ మరీ ఇంత నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని కోలీవుడ్ లో పలువురు కామెంట్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News