: నియోజకవర్గంలోని ముస్లింలను ఉద్దేశిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసిన బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పరంగా పోర్చుగల్ లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తన నియోజకవర్గంలో ఉన్న ముస్లింలను ఉద్దేశిస్తూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారాయన. ఈ శుభ సందర్భంగా రంజాన్ మాసమంతా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు పనివేళలు ముగించుకుని వెళ్లిపోవచ్చని ఆయన తెలిపారు. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు లేకుండా రంజాన్ పవిత్ర ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు.