: చాంపియన్స్ ట్రోఫీ వేళ బీసీసీఐలో సంక్షోభం... రాజీనామా చేసిన రామచంద్ర గుహ
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న వేళ, బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా)లో సంక్షోభం ఏర్పడింది. బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ రామచంద్ర గుహ రాజీనామా కలకలం రేపింది. తన రాజీనామాను సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్) చైర్మన్ వినోద్ రాయ్ కి అందించానని సుప్రీంకోర్టుకు రామచంద్ర గుహ గురువారం నాడు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, గుహ తన వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్టు తెలుస్తుండగా, సుప్రీంకోర్టు మాత్రం, రాజీనామాను జూలైలో పరిశీలిస్తామని వెల్లడించింది. కాగా, లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు ఈ సంవత్సరం జనవరి 30న సీఓఏను సుప్రీంకోర్టు నియమించిన సంగతి తెలిసిందే.