: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి హుండీలో ముఖేష్ అంబానీ సతీమణి ఎంత వేశారంటే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఇటీవల హైదరాబాదులోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చిన ఆమె... అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తమ జట్టు ముంబై ఇండియన్స్ ఐపీఎల్-10ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి హుండీలో ఆమె డబ్బుతో ఉన్న కవర్ ను వేశారు. నేడు ఆలయంలోని హుండీ లెక్కింపు సందర్భంగా ఆమె వేసిన కవర్ ను తెరిచి చూశారు. ఆ కవర్ లో రూ. లక్ష ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. నీతా అంబానీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటుంటారు.