: చెన్నై సిల్క్స్ అగ్నిప్రమాదం: టీనగర్ ఫ్లై ఓవర్ మూసివేత... షాపులు కూడా!


మద్రాసులోని టీనగర్ ఫ్లై ఓవర్ ను, దాని చుట్టుపక్కల షాపులను పోలీసులు మూసేయించారు. నిన్న తెల్లవారు జామున టీనగర్ లోని చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వస్త్ర దుకాణం కావడంతో మంటలు వేగంగా అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి, స్కై లిఫ్టులతో 12 మందిని రక్షించారు. అప్పటికే మంటలు షాపింగ్ మాల్ మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు చుట్టుపక్కల భవనాలకు పాకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సమయంలో 150 మంది అగ్నిమాపక సిబ్బంది సేవలందించారు. అయితే మంటలు ఎంతకూ తగ్గకపోవడంతో 60 ఫైరింజ్లనతో 250 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. 24 గంటలు గడిచినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చుట్టుపక్కల షాపులన్నింటినీ మూసేయించారు. అలాగే మంటలు పూర్తిగా ఆరకపోవడంతో భవనం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందన్న కారణంగా టీనగర్ ఫ్లై ఓవర్ ను మూసేయించారు. అటువైపుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.

  • Loading...

More Telugu News