: 'స్పైడర్' టీజర్ బంపర్ హిట్... తనను డిస్టర్బ్ చేస్తున్న రోబో సాలీడుతో ప్రిన్స్ ఏమన్నాడో చూడండి!


టాగూర్ మధు సమర్పణలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న 'స్పైడర్' టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలై, నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి గ్రాఫిక్స్, సీజీ ప్రధానంగా చిత్రం ఉన్నట్టు టీజర్ ను చూస్తుంటే తెలుస్తోంది. ఓ బాక్స్ రోబో సాలీడుగా రూపాంతరం చెంది నెమ్మదిగా పాకుతూ, మహేష్ బాబు కాలుపైకి ఎక్కడంతో టీజర్ ప్రారంభమవుతుంది. మహేష్ తన ల్యాప్ టాప్ పై పని చేసుకుంటూ ఉండగా, షర్ట్ పైకి ఎక్కే రోబో స్పైడర్, ఆపై భుజాల మీదుగా వెళ్లి ఏదో చెప్పబోతే, మహేష్ డిస్టర్బ్ చేయవద్దు అన్నట్టు 'ష్....' అని తన చూపుడు వేలెత్తి హెచ్చరిస్తాడు. దీంతో ఆ స్పైడర్ ముడుచుకుపోతుంది. ఈ టీజర్ అద్భుతమని కామెంట్లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News