: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే విషయంపై.. రాజస్థాన్ హైకోర్టు జడ్జి ఆశ్చర్యకర వ్యాఖ్యలు


ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే పిటిషన్ ను విచారించిన రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మహేష్ చంద్ర ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఆవు తరహాలోనే నెమళ్లు కూడా పవిత్రమైనవని చెప్పిన ఆయన... నెమళ్లు బ్రహ్మచారులు కావడం వల్లే వాటిని జాతీయ పక్షిగా ప్రకటించారని చెప్పారు. మగ నెమలి బ్రహ్మచారిగానే ఉంటుందని... ఆడ నెమలితో అది శృంగారాన్ని నెరపదని అన్నారు. మగ నెమలి కన్నీళ్లను తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుందని తెలిపారు. అందుకే నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడు తన తలపై ధరించాడని చెప్పారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఆవును చంపినవారికి జీవితఖైదు శిక్షను విధించాలని ఆయన తీర్పును వెలువరించారు.

తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి, లౌకికవాదానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పటికే ఆవును జాతీయ జంతువుగా నేపాల్ ప్రకటించిందని... భారత్ కూడా ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకుని, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు.

  • Loading...

More Telugu News