: ఆమెకు 167వ ర్యాంకు... అతనికి 3వ ర్యాంక్: గురు శిష్యుల సివిల్స్ విజయగాథ!


'శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడిని, తెలుగు మీడియం విద్యార్థిని, కోచింగ్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఏ కోచింగ్ సెంటర్ కు వెళ్లినా చీత్కారాలు, అవమానాలే' అంటూ వాపోయిన 'రోణంకి గోపాలకృష్ణ'కు కోచింగ్ ఇచ్చిందెవరు. సివిల్స్ 3వ ర్యాంకు సాధనలో మెళకువలు నేర్పిందెవరు?... తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థుల్లో ఆశలు రేపుతున్న ఈ విద్యాకుసుమానికి దిశానిర్దేశం చేసిందెవరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే గోపాలకృష్ణకు మెళకువలు నేర్పింది, స్పూర్తినిచ్చింది, దిశానిర్దేశం చేసింది తాజా సివిల్స్ లో 167వ ర్యాంకర్ బాలలత మల్లవరపు!

విద్యకు అంగవైకల్యం అడ్డుకాదని ఎన్నోమార్లు నిరూపించిన మల్లవరపు బాలలత అతనికి కోచింగ్ ఇచ్చారు. తెలుగు మీడియం, స్థానికత, వెనుకబడిన తరగతి, ప్రాంతం వంటివి లక్ష్యసాధనకు అడ్డం కావని అతనికి బోధ చేసి, అతనిలో స్పూర్తి నింపి, అతనిని ర్యాంకర్ గా నిలిపారు. తనకు 167వ ర్యాంకు వచ్చినా అతను 3వ ర్యాంకు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ... బాలలత తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్చర్ ను మార్చిన సందర్భంగా...'నా విద్యార్థి- ఇన్నాళ్లకు నా కల సాకారమయ్యింది' అంటూ గోపాలకృష్ణతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News