: శ్రీనగర్ జైలు నుంచి విడుదలైన యాసిన్ మాలిక్
జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత ముహమ్మద్ యాసిన్ మాలిక్ శ్రీనగర్ కేంద్ర కర్మాగారం నుంచి విడుదలయ్యాడు. మే 28న మాలిక్ ను మైసుమాలోని అతని ఇంట్లోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్లు సబ్జార్ భట్, ఫైజాన్ అహ్మద్ లను గత శనివారం నాడు పుల్వామా జిల్లాలోని సిమోహ్ గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టగా, సబ్జార్ భట్ ఇంటికి మాలిక్ పరామర్శకు వెళ్లాడు. లోయలో ఉద్రిక్తతలను పెంచుతున్నారన్న ఆరోపణలపై మాలిక్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు అతనికి విధించిన ఐదు రోజుల కస్టడీ ముగియడంతో మాలిక్ ను జైలు నుంచి విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.